హిండ్‌వేర్ ఇటాలియన్ సరికొత్త సిరామిక్ టైల్స్ ఆవిష్కరణ
హైదరాబాద్, జూలై 24 2026:
హిండ్‌వేర్ ఇటాలియన్ కలెక్షన్ గుజరాత్‌లోని మోర్బిలో, తన 2026 సిరామిక్ టైల్స్ కలెక్షన్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సిరామిక్ వాల్ టైల్స్ మరియు ఎలివేషన్ టైల్స్‌లో విస్తృత శ్రేణిలో కొత్త డిజైన్‌లు మరియు ఫినిషింగ్‌లను పరిచయం చేసింది.
ఈ లాంచ్‌లో భాగంగా, కంపెనీ తన సరికొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. కస్టమర్‌లు, ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్లు మరియు వ్యాపార భాగస్వాములకు ఉత్పత్తులను సరికొత్తగా, ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా చేయడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 90 మంది ఛానెల్ భాగస్వాముల సమక్షంలో హింద్‌వేర్ లిమిటెడ్ సిఈవో నిరుపమ్ సహాయ్, హింద్‌వేర్ టైల్స్ బిజినెస్ హెడ్ శ్రీ పంకజ్ మెదిరట్ట మరియు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ బాత్ & టైల్స్ అరుణిమా యాదవ్ ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించారు.
అంతర్జాతీయ డిజైన్ ధోరణుల (ట్రెండ్స్) నుండి ప్రేరణ పొందిన ఈ కొత్త కలెక్షన్, విభిన్న ఇంటీరియర్ శైలులకు సరిపోయేలా విస్తృత శ్రేణి నమూనాలను అందిస్తోంది. ఇండ్ల యజమానులు, ఆర్కిటెక్ట్‌లు తమకు నచ్చినట్లుగా... జ్యామితీయ (జియోమెట్రిక్), క్లాసిక్ ఫ్లోరల్, మోడరన్ స్ట్రైప్స్ (చారలు), బ్రిక్ (ఇటుక), స్క్వేర్ (చతురస్ర), మరియు అలల వంటి వేవ్ డిజైన్ల నుండి ఎంపిక చేసుకోవచ్చు.
కేవలం అందమైన డిజైన్లకే పరిమితం కాకుండా, తక్కువ నిర్వహణతో (మెయింటెనెన్స్) ఎక్కువ కాలం మన్నేలా వీటిని రూపొందించడం ఈ కలెక్షన్ యొక్క ప్రత్యేకత. ఈ సిరామిక్ వాల్ టైల్స్ ఇంటి లోపలి భాగాలను సులభంగా శుభ్రం చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తాయి. ఈ లాంచ్‌లో భాగంగా... మోర్బిలోని జాతీయ రహదారిపై వ్యూహాత్మకంగా 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక సరికొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
తమ సరికొత్త సిరామిక్ టైల్స్ కలెక్షన్, నేటి ఆధునిక భారతీయ డిజైన్ ట్రెండ్స్‌ను ప్రతిబింబిస్తోందనీ హిండ్‌వేర్ లిమిటెడ్ సీఈఓ నిరూపమ్ సహాయ్ చెప్పారు.
ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ ప్రదేశాలకు సరిపోయేలా ఎంతో ఆకర్షణీయమైన డిజైన్లు మరియు ప్రీమియం ఫినిషింగ్‌లతో దీనిని రూపొందించినట్టు తెలిసారు. కొత్త వ్యాపార సీజన్‌లోకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో, మా వ్యాపార భాగస్వాములతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ సరికొత్త ఆవిష్కరణ ఒక బలమైన ముందడుగుగా నిలుస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 780కి పైగా చురుకైన (యాక్టివ్) డీలర్లు, 100కు పైగా ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్ల విస్తృత నెట్‌వర్క్ అండతో... హిండ్‌వేర్ ఇటాలియన్ కలెక్షన్ సిరామిక్ టైల్స్ రంగంలో తన మార్కెట్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.






