పాలమూరు 'వీర రేవంత్ రెడ్డి' పాట ఆవిష్కరణ
విడుదల చేసిన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
నిర్మాత రాచాల యుగంధర్ గౌడ్ ను అభినందించిన ఎమ్మెల్సీ..
ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై 'పాలమూరు వీర' అనే పాటను టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శనివారం అసెంబ్లీ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రముఖ నిర్మాత రాచాల యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో కవి, రచయిత రేలారే ప్రసాద్ రచించిన 'పాలమూరు వీర' అనే గీతం అద్భుతంగా ఉందని, రేవంత్ ఒక్కడిగా ఎదిగివచ్చిన విధానం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా ముఖ్యమంత్రిగా ఎదిగిన విధానం గురించి చాలా గొప్పగా చెప్పారని తెలిపారు.
అదే విధంగా అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు పూర్తి చేసిన పథకాలు, ఉద్యోగాలు, అభివృద్ధి గురించి కూడా ఇందులో చక్కగా పొందు పరిచారని కొనియాడారు. ఈ పాట నిర్మాత రాచాల యుగంధర్ గౌడ్ ను, రచన చేసిన రేలా రే ప్రసాద్ ను, సంగీతం అందించిన కళ్యాణ్ కీస్, గాయకుడు ఎంఎల్ఆర్ కార్తికేయను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గాలిగల్ల సాయిబాబా, నవీన్, గౌతమ్ పాల్గొన్నారు.




