మహిళ అదృశ్యం
07-12-2024 11:30 PM
హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన మహిళ అదృశ్యమైన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ ఎస్‌ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం... హుజుర్‌నగర్‌కు చెందిన జర్పుల సంధ్య(22)కు మఠంపల్లి మండలం పాతదొన బండ తండాకు చెందిన బాణోతు కోటేశ్వరరావుతో ఈ ఏడాది ఏప్రిల్ 21 వివాహం అయింది. గత కొన్ని రోజులుగా అనుశ్రీ ఇనిస్టిట్యుట్ నందు బ్యూటిషియన్ ఫ్యాకల్టీగా చేస్తున్న సంద్య ఈ నెల 6 సాయంత్రం ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్లిపోయిందని, ఆచుకి దొరక్కపోవడంతో భర్త కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.




