అక్క- అన్న ఏఐ డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం
నల్లగొండ టౌన్, జూలై 1: ప్రభుత్వం ప్రారంభించిన ’అక్క-అన్న ఏ ఐ అండ్ డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్’ స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రారంభించారు. డిగ్రీ, విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత పెంపొందించేందుకు కార్యక్రమాన్ని రూపొందించి నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. శ్రీనివాసరాజు తెలిపారు. ప్రతి డిగ్రీ విద్యార్థినికి 10 మంది పాఠశాల విద్యార్థుల చొప్పున కేటాయించారు.
రామగిరి బాయ్స్ హై స్కూల్, గరల్స్ హై స్కూల్, బోయవాడ స్కూల్, బొట్టుగూడ స్కూల్, ఆర్పీ రోడ్, డీవీకే రోడ్ ప్రభుత్వ పాఠశాలలు, మాన్యంచల్క, పానగల్లు, ఉర్దూ మీడియం స్కూళ్లలో డిగ్రీ విద్యార్థులు ’అక్క-అన్న మెంటర్షిప్ ప్రోగ్రామ్’ నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల సామర్థ్యాలు మెరుగై భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీనియర్ ఫ్యాకల్టీ డా. ఎస్. రాజారామ్ తెలిపారు.






