26 July, 2026 | 1:45 AM

‘లాస్ట్‘వార్నింగ్’పుస్తకావిష్కరణ

26-07-2026 12:00 AM

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): కాలేయ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రముఖ హెపటాలజిస్ట్ డాక్టర్ కె.ఎస్. సోమశేఖర్‌రావు రచించిన ‘లాస్ట్ వార్నింగ్‘ (ఆంగ్లం), ‘ఆఖరి హెచ్చరిక‘ (తెలుగు) పుస్తకాలను శనివారం యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, లోక్‌సభ సభ్యురాలు డాక్టర్ శభరి బైరెడ్డి, యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్.రావు పాల్గొన్నారు.

ఈ పుస్తకాల ద్వారా ఫ్యాటీ లివర్, వైరల్ హెపటైటిస్, లివర్ సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధుల లక్షణాలు, నివారణ, ముందస్తు గుర్తింపు, ఆరోగ్యకరమైన జీవనశైలి, టీకాల ప్రాముఖ్యత వంటి అంశాలను సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.ఎస్. సోమశేఖర్ రావు మాట్లాడుతూ, వ్యాధి రాకముందే అవగాహన కల్పించడమే అత్యుత్తమ వైద్యం అని అన్నారు.