10 July, 2026 | 12:38 AM

నాగబాబు ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ దంపతులు

15-12-2024 06:43 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ తన కుటుంబంతో సహా మేనమామ నాగబాబు ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసిన అల్లు అర్జున్ దంపతులు జూబ్లీహిల్స్ లోని నాగబాబు ఇంటికి వెళ్లారు. తన ఇంటికి విచ్చేసిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులకు మామ సాదర స్వాగతం పలికి ఆయనను ఆత్మీయంగా హత్తుకుని, ఇంట్లోకి తీసుకెళ్లారు. అరగంటపాటు అక్కడే ఉండి సంధ్య థియేటర్ ఘటనను, కేసుకు సంబంధించిన వివరాలను నాగబాబుకు తెలియజేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో పుష్ప-2 బెనిపిట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ ను చిక్కడిపల్లి పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైల్ కు తరలించారు. ఈ కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజారు చేయడంతో నిన్న ఉదయం విడుదలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చారు.