19 August, 2026 | 10:35 PM

తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు నేతల పరామర్శ

15-06-2024 01:36 AM

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తలసాని శంకర్‌యాదవ్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్ర వారం పలువురు నాయకులు తలసాని శ్రీనివాస్‌ను పరామర్శించారు. శంకర్‌యాదవ్ చిత్రపటానికి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ ఎమ్మెల్యే నోములు భగత్, కాంగ్రెస్ నాయకుడు నవీన్‌శంకర్‌యాదవ్ ఉన్నారు.