19 August, 2026 | 11:44 PM

భువనగిరి అభివృద్ధికి కృషి చేస్తా

15-06-2024 01:31 AM
  • ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి, జూన్ 14 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి భువనగిరి పార్లమెంట్ పరిధిలో అభివృద్ధికి కృ షి చేస్తానని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆలేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించగా, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హ యాంలో నిధుల కేటాయింపులేక అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు కలిసి ఆలేరు మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేయించాలని కోరుతూ ఎంపీ, ఎమ్మెల్యేకు వినతిప త్రం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ మాధవి, కమిషనర్ లక్ష్మి, కౌన్సిలర్లు సునీత, శమంతరెడ్డి, బేతి రాములు, జూకంటి శ్రీకాంత్, సంగు భూపతి పాల్గొన్నారు.

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు..

ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఎంపీ అన్నారు. బీబీనగర్ మండలం కొండమడుగులో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.