25 August, 2026 | 7:17 PM

కాచాపూర్ సొసైటీలో మొక్కలు నాటిన నాయకులు

25-08-2026 06:45 PM

బిక్కనూర్,(విజయ క్రాంతి): బిక్కనూర్ మండలం కాచాపూర్ సొసైటీ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సొసైటీ సీఈఓ బస్సాపూర్ మహేశ్వరి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డైరెక్టర్, మాజీ ఎంపీపీ సుదర్శన్, మాజీ సర్పంచ్ భూపతి, యాదయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఊడెం మెట్టు, ఎస్‌ఎస్ క్లర్క్ గాల్‌రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు భూమిని స్వామి, బీర్ కోరి స్వామి, సొసైటీ క్లర్క్ మెట్టు రేణుక తదితరులు పాల్గొన్నారు.