26 August, 2026 | 1:24 AM

రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి

25-08-2026 06:57 PM

వ్యవసాయ శాస్త్రవేత్త సతీష్ చంద్ర 

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): రైతులకు ఈ సీజన్లో ఎల్మినో  ప్రభావం వల్ల తట్టుకోవడానికి ఆరుతడి పంటలు సాగు చేయాలని కూనారం వ్యవసాయ  శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చంద్ర అన్నారు, మంగళవారంపెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలోని రైతు వేదికలో ఆత్మ–వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆరు తడి పంటల ప్రాధాన్యం, వరి మరియు పత్తి పంటల సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కునారం వ్యవసాయ శాస్త్రవేత్త డా. సతీష్ చంద్ర మాట్లాడుతూ  వరి మరియు పత్తి పంటల లో విత్తన శుద్ధి మొదలు వివిధ దశలలో ఎరువులు, పురుగు మందుల వాడకం గురించి అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి పైడితల్లి  మాట్లాడుతూ వ్యవసాయం లో భూసార పరీక్ష ప్రాధాన్యం  భూమి సారాన్ని కాపాడుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం మరియు పంటల దిగుబడిని పెంచుకోవడం వంటి అంశాలపై వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కవిత, ఏఈవోలు పద్మ, అనూష , ఆనంద్, రవితేజ, రాజు, ప్రశాంత్, రైతులు పాల్గొన్నారు.