2 May, 2026 | 6:58 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

జాగృతి వ్యవస్థాపకురాలు కవిత జన్మదిన వేడుకలు జరుపుకొన్న నాయకులు

14-03-2026 12:04 AM

నాగిరెడ్డిపేట్,మార్చి 13 (విజయక్రాంతి): జాగృతి వ్యవస్థాపకురాలు కవిత జన్మదిన వేడుకలు సందర్భంగా నాగిరెడ్డిపేట మండల జాగృతి పార్టీ మండల నాయకులు ఆయా గ్రామాల అధ్యక్షులు కేకు కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. కామారెడ్డి జిల్లా కన్వీనర్ సంపత్, మండల అధ్యక్షులు సుభాన్ రెడ్డి ఆదేశాల మేరకు జాగృతి వ్యవస్థాపకురాలు కవితక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగిందన్నారు.

అనంతరం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ విష్ణు, జనరల్ సెక్రటరీ ఖలీల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీను,యూత్ అధ్యక్షులు ఫయీం, మండల మహిళా అధ్యక్షురాలు పద్మ, మాల్తుమ్మెద, గోపాల్పేట్, చినుర్ గ్రామాల అధ్యక్షులు బలరాం, సిద్ధరాములు, బాతుల ప్రవీణ్, బాతుల నిఖిల్, సలహాదారులు యాదగిరి, ఎజాస్ తదితరులు పాల్గొన్నారు.