14 March, 2026 | 2:30 AM

మార్చి 16న జాతీయస్థాయి మేనేజ్మెంట్ టాలెంట్ టెస్టు

14-03-2026 12:02 AM

ఐఐఎంసీ కళాశాల ఆధ్వర్యంలో ఆన్ లైన్‌లో నిర్వహణ

ఖైరతాబాద్, మార్చి 1౩(విజయక్రాంతి): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కళాశాల (స్వయం ప్రతిపత్తి), ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్ర్పైజ్ సంస్థ సంయుక్తంగా ఈ నెల 16న జాతీయ స్థాయి మేనేజ్మెంట్ టాలెంట్ టెస్టును అంతర్జాల మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్నాయి. డిగ్రీ, పీజీ విద్యార్థుల్లో మేనేజ్మెంట్ సంబంధిత వి షయాలలో సంభావిత జ్ఞానాన్ని, ప్రతిభను అన్వేషించడం, అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ‘జాతీయ స్థాయి మేనేజ్మెంట్ టాలెంట్ టెస్టు (ఆన్ లైన్)’ ను నిర్వహించనున్నారు. ఇందులో వివిధ కళాశాలలకు చెం దిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కళాశాల ప్రిన్సిపాల్ కూర రఘువీర్ జాతీయ స్థాయి మేనేజ్మెంట్ టాలెంట్ టెస్టుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేస్తూ తెలియజేశారు.

ఈ పరీక్షలో మేనేజ్మెం ట్ ప్రాథమికాంశాలకు సంబంధించిన 120 బహుళైచ్చిక (మల్టిపుల్ ఛాయిస్) ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష  సమయం 1గంట. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఫీజు లేదు. పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.ఈ పరీక్షకు సంబంధించిన గూగుల్ అంతర్జాల లింకు మా కళాశాల వ్బుసైట్ www.iimchyd.ac.inలో16న మ ధ్యాహ్నం 2 నుంచి ౩ గంటల వరకు అందుబాటులో ఉంటుంది. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ కోరారు. వివరాల కోసం 9010770 605, 9573027171, 98480 57951, 9346978530, 9703476767, 95531 62767 ఫోన్ నంబర్ లలో సంప్రదించగలరు. మేనేజ్మెంట్  టాలెంట్ టెస్ట్ బ్రోచర్ కోసం కళాశాల వ్బుసైట్ చూడగలరు.