28 June, 2026 | 12:08 PM

Breaking News

రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •   ఆర్‌ఎస్‌పీ భద్రత తగ్గింపు కక్ష సాధింపు చర్యే   •  

దేశంలో జీసీసీల హవా

02-06-2024 01:48 AM

దేశంలో 17శాతం లీజింగ్ వృద్ధి

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 1 (విజయక్రాంతి): దేశంలో అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల (జీసీసీలు) హవా కొనసాగుతుంది. 2022- పోలిస్తే 2023 జీసీసీల లీజింగ్ 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 జీసీసీల లీజింగ్ 19.2 మిలియన్ చదరపు అడుగులు ఉండగా, 2023 22.5 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఇందులో ఇంజినీరింగ్, తయారీ కంపెనీల వాటా నాలుగింట ఒక వంతు కలిగి ఉండగా.. ఆటోమొబైల్ సంస్థలు తర్వాతి స్థానంలో ఉన్నాయి.

భవిష్యత్తులో మరింత విస్తరణ

2025 నాటికి 1,900 జీసీసీలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాన్యుఫ్యాక్చర్ వంటి రంగాల్లోని ప్రధాన కంపెనీలు దేశంలో తమ ఉనికిని జీసీసీల ద్వారా పెంచుకోవాలని భావిస్తున్నాయి. ప్రీమియం అఫీస్ స్పేస్ కోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో జీసీసీలు బాగా ఆదరణ పొందుతున్నాయి. కంపెనీలు నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తుండటంతో జీసీసీల హవా నడుస్తోంది. 2024 జీసీసీలు 40 నుంచి 45 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజింగులు జరుగుతాయని అంచనా. డిజిటల్ టెక్నాలజీపై భారతదేశం అనుసరిస్తున్న వ్యూహాత్మక ప్రాధాన్యం తదితర అంశాలు ఈ విభాగంలో వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంతో కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో మరిన్ని అత్యాధునిక జీసీసీలు వచ్చే అవకాశం ఉందని సీబీఆర్ ఇండియా చైర్మన్, సీఈఓ అనుమన్ మ్యాగజీన్ వెల్లడించిన నివేదికలో పేర్కొన్నారు.

ఆఫీసు స్పేస్‌లలో జీసీసీల వాటా 29శాతం..

2024 జనవరి కాలంలో దేశంలో మొత్తం లీజుకు తీసుకున్న ఆఫీస్ స్పేస్‌లో జీసీసీల వాటా 29 శాతంగా ఉండటం గమనార్హం. నగరాల వారీగా చూస్తే అత్యధికంగా 60 శాతం వాటాతో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా.. 26 శాతంతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. 9 శాతంతో ఢిల్లీ, 4 శాతంతో ముంబై, ఒక శాతం వాటాతో పుణె తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత కార్యాలయ రంగంలో జీసీసీలు కీలక మార్పులు తీసుకొచ్చాయి. 2017 కాలంలో దేశంలోని మొత్తం ఆఫీస్ లీజింగ్‌లో 30 నుంచి 35 శాతం వాటాతో 1,250 జీసీసీలు అందుబాటులోకి వచ్చాయి. 2020- మధ్య కాలంలో 1,580 జీసీసీలతో మొత్తం అఫీస్ లీజింగ్‌లో 38 నుంచి 43 శాతం సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా జీసీసీల వృద్ధిలో భారతదేశం అగ్రగామిగా నిలిచింది.

నాణ్యతకే ప్రాధాన్యం..

భారతదేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల తీరు క్రమంగా మారుతోంది. కంపెనీలు నాణ్యతకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రీమియం ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్ పెరుగుతుంది. ఉన్నతమైన మౌలిక సదుపాయాలతో పాటు ఆకర్షణీయమైన వాతావరణం, అభివృద్ధి చెందుతున్న పని విధానాలతో పాటు ఆవిష్కరణలకు, ప్రతిభకు భారత్ ప్రధాన గమ్యస్థానంగా వృద్ధి చెందుతోందని అని సీబీఆర్ ఇండియా అడ్వుజరీ, ట్రాన్సాక్షన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ చందనాని తెలిపారు.