12 March, 2026 | 9:49 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

గుండెపోటుతో లెక్చరర్ మృతి

30-11-2024 02:56 AM

కామారెడ్డి, నవంబర్ 29 (విజయక్రాంతి): గుండెపోటుతో లెక్చరర్ మృతిచెందిన ఘటన కామారెడ్డి జి ల్లా కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. బాన్సువా డ నియోజకవర్గంలోని కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జువాలజీ లెక్చరర్‌గా గోవర్ధనాచారి(49) విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈక్రమం లో శుక్రవారం బోధన సమయంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మృతిచెం దినట్లు వైద్యులు నిర్ధారించారు.