1 July, 2026 | 11:23 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఇరాన్ పై అమెరికా దాడి పట్ల వామపక్షాల నిరసన

24-06-2025 06:18 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇరాన్ పై అమెరికా దాడిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్(US President Donald Trump) దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల  నాయకులు సాదుల శ్రీనివాస్, మండల వెంకన్న, పాయం చిన్న చంద్రన్న, గౌని ఐలయ్య పెరుగు కుమార్, మదార్ మాట్లాడుతూ... ఇరాన్ పై అమెరికా వెంటనే దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రెండు వారాల్లో ఇరు దేశాల మధ్య శాంతి చేస్తానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు అమెరికా ఇరాన్ పై దాడులకు పాల్పడటం సిగ్గు చేటన్నారు.

చమురు నిల్వల కోసం అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తుందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధం ఆపే విధంగా ట్రంప్ తో మాట్లాడాలన్నారు. ప్రపంచ ప్రజలందరూ యుద్ధం అపాలని ఆందోళన చేస్తుంటే ట్రంప్ యుద్ధం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు చింత కుంట్ల వెంకన్న, వెలుగు శ్రవణ్, హాలవాత్ లింగ్య, సామా పాపన్న, అల్వాల వీరన్న, కుంట ఉపేందర్, దుడ్డెల రామ్మూర్తి, కొత్తపల్లి రవి, సూరి, అబోతు అశోక్, రాగం మల్లయ్య, కుమ్మరి కుంట్ల నాగన్న, కోటేష్, బాలాజీ, బోళ్ల భద్రయ్య, వేణు, హేమ నాయక్ తదితరులు పాల్గొన్నారు.