1 July, 2026 | 10:24 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమాణాలు విధిస్తాం...

24-06-2025 06:22 PM

పలు దుకాణాలలో ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని ఆకస్మికంగా తనిఖీ..

ఎంపీడీవో విజయ భాస్కర్..

మునుగోడు (విజయక్రాంతి): నిబంధనలను ఉల్లంఘించి ప్లాస్టిక్ కవర్లు ఇతర ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తే జరిమానాలు విధిస్తామని మునుగోడు ఇన్చార్జ్ ఎంపీడీవో భాస్కర్(incharge MPDO Bhaskar) అన్నారు. మండలంలోని మునుగోడు మేజర్ గ్రామపంచాయతీ కిరాణా షాపులు, కూరగాయ దుకాణాల ఆకస్మిక తనిఖీ చేశారు. సింగల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం ఉన్నందున  దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లు లేదా ఇతరత్రా ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు విక్రయిస్తున్నారని పరిశీలించారు.

నిబంధనలకు విరుద్ధంగా అమ్మిన దుకాణ యజమానులకు 13 వేల రూపాయల జరిమానా విధించారు. షాపుల నందు ఉన్న ప్లాస్టిక్ను, ప్లాస్టిక్ కవర్లను గ్రామపంచాయతీ జప్తు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్లాస్టిక్ ని అమ్మినట్లయితే, వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మునుగోడు గ్రామాన్ని ఐక్యంతో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ తనిఖీలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయ భాస్కర్, మండల పంచాయతీ అధికారి  స్వరూప రాణి, మునుగోడు గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.