calender_icon.png 25 June, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు డ్యూటీ మీట్

24-06-2025 06:15:28 PM

నిర్మల్ (విజయక్రాంతి): పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వృత్తి నైపుణ్యత పెంపొందించి అంకితభావంతో పని చేసేందుకు పోలీస్ శాఖ డ్యూటీ మీట్(Duty Meet) కార్యక్రమాల నిర్వహిస్తుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) తెలిపారు. మంగళవారం పోలీస్ డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పోలీసులు విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలని ఆదేవిధంగా న్యాయ నిరూపణ జరగాలంటే సరైన, అధారాలు, నేర దర్యాప్తు చాల కీలకమైనదని జిల్లా ఎస్పీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిల్లా స్దాయి పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిచడం జరుగుతుందన్నారు. ఈ డ్యూటీ మీట్‌ లో పోలీస్‌ అధికారులు నిరంతరం నిర్వహించే విధులకు సంబంధించి వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది.

ఇందులో భాగంగా కంప్యూటర్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫింగర్‌ ప్రింట్స్‌, హ్యాండ్లింగ్‌, ప్యాకింగ్‌ లిఫ్టింగ్‌, బాంబ్‌ డిస్పోజల్‌, పోలీస్ జాగిలాల విభాగంలో ట్రాకింగ్, ఎక్స్ప్లోజివ్ విభాగాల్లో, ఫోటో, వీడియోగ్రఫీ విభాగాల్లో పోటీలను నిర్విహించబడుతాయి. ఈ పోటీలలో రాణించిన వారిని జోనల్ స్థాయిలో నిర్వహించబడే పోలీస్ డ్యూటీ మీట్ కు ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించటం జిల్లాలో ఇదే మొదటి సారి కావున జిల్లా పోలీస్ సిబ్బంది అన్ని పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచి జిల్లాకి మంచి పథకాలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు జిల్లా అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, డిఎస్బి ఇన్స్పెక్టర్ సమ్మయ్య, ఆర్ఐలు రామ్ నిరంజన్ రావ్(అడ్మిన్), శేఖర్, రమేష్, రామ క్రిష్ణ, ఆర్ ఎస్సైలు, డాగ్ స్క్వాడ్ బృందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.