2 May, 2026 | 7:26 PM

Breaking News

డి.ఎస్.పి మహేందర్ రెడ్డికి ఎస్పీ అభినందనలు   •   రఘునాథ బంజరలో కొత్తగా మట్టి రోడ్డు ఏర్పాటు   •   ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ   •   అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి   •   మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •  

అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి

11-03-2026 12:23 AM

అయిజ మార్చి 10: అయిజ మున్సిపాలిటీలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అం బేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి  అవమాన పరిచిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించారు. సోమవారం రాత్రి 10  గంటల సమయం దాటిన తర్వాత గుర్తుతెలియని దుండగులు  దాడి చేసి వేలు విరగొట్టారని అన్నారు.

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని, దీన్ని బట్టి చూస్తే ఇవి ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయని,  అట్టి దుండగులు చేత ధ్వంసమైనచోట విగ్రహ పునర్నిర్మాణం చేపట్టి, భవిష్యత్తులో ఇట్టి దాడులకు పాల్పడకుండా దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

స్థానిక ఎసై శ్రీనివాసరావు వచ్చి దీని కారకులను గుర్తించి అరెస్టు చేసి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కౌన్సిలర్ మద్దిలేటి, దండోరా జిల్లా మాజీ నాయకులు రాజు, జై భీమ్  ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాచర్ల ప్రకా ష్,మైనర్ బాబు మొదలగువారు పాల్గొన్నారు.