11 March, 2026 | 3:38 AM

నిఘానేత్రంలో ఇసుక రవాణా

11-03-2026 12:21 AM

పక్కదారి పడితే చర్యలు తప్పవు : జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్, మార్చి 10 (విజయక్రాంతి): జిల్లాలో ఇసుక పంపిణీ పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ప్రజల అవసరాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను కూడా ఆన్లైన్ ద్వారానే అందించాలన్నారు.

జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు జీపీఎస్ కలిగిన, మైనింగ్ శాఖ వద్ద రిజిస్టర్ అయిన వాహనాల ద్వారానే రవాణాకు అనుమతి ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని 18 ఇసుక రీచ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లోడింగ్ నిర్వహించాలని, అక్రమంగా ఇసుక తరలించే వాహనాలు పట్టుబడితే రూ.20 వేల వరకు జరిమానా విధించాలని హెచ్చరించారు. సమావేశంలో మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.