ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు
23-07-2026 02:09 PM
2వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరామ ప్రసాద్
హుజూర్ నగర్, జూలై 23: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించాలని మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరామ ప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్లు మండల న్యాయ సేవ అధికార సంస్థ సిబ్బంది అనిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కాసరగడ్డ దీపతో పాటు పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొని విద్యార్థులకు వివిధ చట్టాలపై అవగాహన కలిగిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు.






