ఓటర్ జాబితా నుంచి ఓటు మిస్ కాకుండా చూడాలి
తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షులు రేగటి రవి గౌడ్
తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి మండలంలోవెంపటి , రామన్నగూడెం తండా, మంచే తండా, సూర్య తండా, దేవుని గుట్ట తండా, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు రివిజన్ కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేగటి రవి గౌడ్ మాట్లాడుతూ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశాను ప్రకారం, అర్హత కలిగిన ప్రతి ఒక్క నిజమైన ఓటరు కూడా ఓటరు జాబితాలో నుంచి మిస్ కాకుండా, ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ (BLA) ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే డ్యూయల్ ఓటర్లు ఉన్నట్లయితే వారిని చైతన్యపరచి ఒకే చోట ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓటరు నమోదు, మార్పులు, చేస్తామని చేర్పులు, తొలగింపులకు సంబంధించిన ఫారాలను నింపే సమయంలో పూర్తి వివరాలతో, నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తగా నింపాలని సూచించారు.
కార్యక్రమంలో బి ఎల్ ఓ ల నియోజకవర్గ ఇంచార్జ్ పానుగంటి నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రుద్ర రామచంద్రు,పోలేపాక రామచంద్రు,నల్లు రామచంద్రారెడ్డి, మహేందర్ కొండరాజు, వీరబోయిన గంగరాజు, దీప్లా నాయక్, కొండ పరశురాం, అబ్బ గాని వేణు, వెంకటేష్ నేత, కొండా వెంకన్న, యాదగిరి, ఆకారపు ఎల్లయ్య, తప్పట్ల శంకర్, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.






