18 April, 2026 | 2:21 AM

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

18-04-2026 12:39 AM

రాజాపూర్ ఏప్రిల్ 17: ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సంఘం నాయకులు ఉదయ్ కుమార్ అన్నారు. శుక్రవారం తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ జే ఏ సీ ఆధ్వర్యంలో నేడు రాజాపూర్ తాసిల్దార్ రాధాకృష్ణ కు వినతి పత్రం అందజేశారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరిం చాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు చేయాలని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల పెం డింగ్ బిల్లులు వెంటనే క్లియర్ చేయాలి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ వెంటనే అమలు చేయాలి.సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.పెండింగ్లో ఉన్న డిఎ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.