17 April, 2026 | 3:29 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

డ్రగ్స్ రహిత సూర్యాపేటలో భాగస్వాములవుదాం

26-06-2025 12:00 AM

సూర్యాపేట, జూన్ 25 (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత సూర్యపేటలో ప్రతి ఒక్కరం భాగస్వా ము లమవుదామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించే వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లోని సెల్ఫీ పాయింట్ వద్ద ఎస్పీ నర్సింహతో కలిసి ఫోటోలు దిగారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత, విద్యార్థులు కలిసికట్టుగా ముందడుగు వేయాలన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.   మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నేడు జరిగే ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. వీరి వెంట పలువురు అధికారులు ఉన్నారు.

విద్యార్థులకు గుణాత్మకమైన విద్యనందించాలి

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, జూన్ 25 (విజయక్రాంతి) :  విద్యార్థులకి  గుణాత్మకమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, తహసీల్దార్, ఆర్డివో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ హెచ్ ఎస్ లోని పదవ తరగతి గదిలో జరుగుతున్న గణితం క్లాస్ ని, 9 వ తరగతి లో జరుగుతున్న బేస్ లైన్ టెస్ట్ లను పరిశీలించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.

60 రోజుల కార్యాచరణ ప్రతి పాఠశాలలో అమలు చేసి ఆగస్టు 15 నాటికి జిల్లాలో తెలుగు చదవటం, రాయటం రాని వారు ఉండవద్దనీ ఆదేశించారు. బుక్ డిపో, కంప్యూటర్ ల్యాబ్ పరిశీలించారు.  తదుప చర్చి కాంపౌండ్ లో గల అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి స్టాక్ రిజిస్టర్, హాజరు రిజిస్టర్ లను పరిశీలించి పలు విషయాలపై ఆరా తీశారు. అనంతరం తహసీల్దార్, ఆర్డివో కార్యాలయాలను సందర్శించి సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవిన్యూ సదస్సులలో స్వీకరించిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులు పరిశీలించి భూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈయన వెంట ఆర్డివో వేణుమాధవరావు, తహసీల్దార్ కృష్ణయ్య, జడ్పీ హెచ్ ఎస్ హెడ్ మాస్టర్ పద్మ,ఉపాధ్యాయులు ఉన్నారు.