లక్ష్మీనగర్ లయన్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
09-06-2026 12:00 AM
ముకరంపుర, జూన్ 8 (విజయక్రాంతి): కరీంనగర్ లక్ష్మీ నగర్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ప్రెసిడెంట్ గా పెద్ది రఘనాథ్, సెక్రెటరీగా బొలుసాని లక్ష్మన్, ట్రెజరర్ గా రాచమళ్ళ శ్రీనివాస్, సభ్యులచే చిదుర సురేష్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన క్లబ్ సభ్యులు ఎలగందుల మునీందర్, కొంజర్ల నవీన్ కుమార్, బోయిన్పల్లి సరళ, తనుగుల అనిల్ కుమార్, కాముని తిరుమలేష్ గుప్తా, జిల్లా వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.






