కార్మికుల దినోత్సవాన్ని జయప్రదం చేద్దాం
27-04-2026 02:17 AM
ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ బాబు
జవహర్‌నగర్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): మే డే స్ఫూర్తితో... కార్మికుల దినో త్సవాన్ని జయప్రదం చేద్దామని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ బాబు పిలుపునిచ్చారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరే షన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని నీలం రామచంద్రయ్య భవన్‌లో మే డేని పురస్కరించుకొని ఐఎఫ్టియు నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా శివ బాబు మాట్లాడుతూ నల్ల చట్టాలతో బడా కంపెనీలకు బాటలు వేస్తూ కార్మికుల పొట్టను కొడుతున్న కార్పొరేట్ వ్యవస్థను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. కార్మికులందరూ ఏకమై మేడేను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జయసుధ, కృష్ణ, మనమ్మ, యాద మ్మ తదితరులు పాల్గొన్నారు.






