12 May, 2026 | 11:58 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన మల్లు భట్టి విక్రమార్క

27-04-2026 02:19 AM

మధిర, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): మల్లు భట్టి విక్రమార్క పెనుగంచిప్రోలు పట్టణంలో ఆదివారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన రాకతో అక్కడి వాతావరణం సందడిగా మారింది. స్థానిక నాయ కులు, అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి తరలివచ్చి ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మధిరకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భట్టి విక్రమార్కని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారు ప్రాంతీయ సమస్యలు, అభివృద్ధి అంశాలపై ఆయనతో సంక్షిప్తంగా చర్చించినట్లు తెలిసింది. భట్టి విక్రమార్క కూడా వారిని ఆప్యాయంగా పలకరించి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని భరో సా ఇచ్చినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అభిమానులు భట్టి విక్రమార్క సాదాసీదా వ్యవహారశైలి, ప్రజలతో కలిసిపోయే స్వభావాన్ని ప్రశంసించారు. ఆయన హాజరు కావడంతో కార్యక్రమానికి మరింత ప్రాముఖ్యత చేకూరిందని పలువురు అభిప్రాయ పడ్డారు. ఈ భేటీ సందర్భంగా మధిర ప్రాంతానికి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని భట్టి విక్రమార్క హామీ ఇచ్చినట్లు అక్కడి వర్గాలు తెలిపాయి.  ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిర్యాల వెంకటరమణ గుప్తానాయకులు పాల్గొన్నారు.