ఆర్యవైశ్యుల సేవలు వెలకట్టలేనివి
ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి
గజ్వేల్, జూన్ 8: సమాజాభివృద్ధిలో ఆర్యవైశ్యుల సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. శనివారం గజ్వేల్‌లో మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి అధ్యక్షతన నిర్వహించిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) సిద్దిపేట జిల్లా బాధ్యుల ప్రమాణ స్వీకారానికి వారు హాజరై మాట్లాడారు. ఐవీఎఫ్ ద్వారా 500ల మందికి పైగా ఉన్నత విద్య కోసం రూ.లక్ష చొప్పున సాయం చే యడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పది మందికి కుట్టు మిషన్లు, బియ్యం పంపిణీ చేశారు. కాగా, ప్రమాణ స్వీకారం చేసిన వారికి డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నేతి సంతోష్ గుప్త, సంతోష్ గుప్త, స్వప్న పాల్గొన్నారు.






