16 May, 2026 | 10:56 PM

కామ్రేడ్ మారోజు వీరన్న ఆశయాలను సాధిద్దాం

16-05-2026 09:50 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): బహుజన ఐక్య ఉద్యమ నేత , కులవర్గ పోరాట సిద్ధాంతకర్త, సామాజిక తెలంగాణ రూపకర్త కామ్రేడ్ మారోజు వీరన్న  27వ వర్ధంతి సందర్భంగా ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ గౌరవ డా. తాడోజు వాణి శ్రీకాంత్ రాజుఆదేశం మేరకు,  సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వారి స్వగ్రామమైన కొత్తగూడెం లో , వీరన్న నిలువెత్తు విగ్రహానికి పుష్పాలంకరణ చేసి వీరన్న ఆశయాలు సాధిద్దామని కోరారు. అనంతరం  భోజనం ప్యాకెట్లను మరియు చల్లని మజ్జిగతో పాటుగా కూల్ వాటర్ పంపిణీ చేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీధర్ , సూర్యాపేట జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సయ్యద్, మద్దిరాల మండల పార్టీ అధ్యక్షులు తునికి బద్రి గౌడ్, తుంగతుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు వుల్లెందుల వెంకన్న, దంతాలపల్లి మండల అధ్యక్షులు ఊడుగుల ఐలయ్య యాదవ్ , నియోజకవర్గ నాయకులు , బి సైదులు ముదిరాజ్,  మేడబోయిన గంగయ్య యాదవ్ , గుండాల మల్సూర్ , అభిలాష్ యాదవ్, అంబటి రాములు మరియు ప్రసన్న  , శంకర్,  రాజు తదితరులు పాల్గొన్నారు.