10 July, 2026 | 1:50 AM

ఈశాన్య సంస్కృతిని గౌరవిద్దాం

10-07-2026 12:43 AM

కిమ్స్, నెకా కార్యక్రమంలో మహేష్ భగవత్

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో అనేక రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉంటారని వారి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం మన బాధ్యత అని, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం మరింత బలపడాల్సిన అవసరం ఉందని తెలంగాణ లా అండ్ ఆర్డర్ డీజీపీ ఎం.మహేష్ భగవత్ అన్నారు. కిమ్స్ ఆసుపత్రి, నార్త్ ఈస్ట్ కనెక్ట్ అసోసియేషన్ (నెకా) సంయుక్తంగా గురువారం సికింద్రాబాద్‌లో నిర్వహించిన ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిపై అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర, భాషలపై అవగాహనకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

కిమ్స్ ఎండీ భాస్కర్ రావు మా ట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల సం స్కృతి, జీవన విధానంపై అవగాహన పెం పొందించి, వారికి మరింత ఆత్మీయమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించా మన్నారు. నెకా ఉపాధ్యక్షుడు సర్బేశ్వర్ మాట్లాడుతూ.. ఈశా న్య రాష్ట్రాల ప్రజల పట్ల పరస్పర అవగాహన, గౌరవాన్ని పెంపొందించడం, సమ్మిళిత సమాజ నిర్మాణానికి తోడ్పడడమే తమ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అజైలియు నియుమై ఈశాన్య రాష్ట్రాల సామాజిక, సాం స్కృతిక విశిష్టతపై ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వగా, సీనియర్ జర్నలిస్ట్ ఎం. సోమశేఖర్ ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో నెకా అధ్యక్షుడు పాపారావు బియ్యాల (ఐఏఎస్, రిటైర్డ్), ఉపాధ్యక్షుడు గౌతమ్ సవాంగ్ (ఐపీఎస్, రిటైర్డ్), కోశాధికారి అడ్వొకేట్ స్టీఫెన్ రోనోజిత్ సేన్, బోర్డు సభ్యులు డా. కే రాజేశ్వరరా వు (ఐఏఎస్, రిటైర్డ్), శ్రీధర్ ముప్పిడి, కిమ్స్ ఆసుపత్రి మెడికల్ ఆపరేషన్స్ డైరెక్టర్ డా. సంబిత్ సా హు, హైదరాబాద్‌లో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అసోం రాష్ట్రానికి చెందిన సం ప్రదాయ బిహు నృత్యం, ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయ వస్త్రధార ణ ప్రదర్శన, మణిపురి నృత్యం ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.