16 April, 2026 | 2:49 AM

అమరుల స్ఫూర్తితో హక్కులు సాదిద్దాం

03-06-2025 12:00 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి 

కుమ్రంభీం అసిఫాబాద్, జూన్ 2 (విజ యక్రాంతి): తెలంగాణ అమరవీరుల స్ఫూర్తి తో హక్కులను సాధించుకుందామని ఎమ్మె ల్యే కోవ లక్ష్మి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం బీఆర్‌ఎస్ భవనం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు.

అంతకుముందు బస్టాండ్ సమీపంలోని తెలంగా ణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కుమ్రంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులను తెలంగాణ ప్రజానీకం ప్రతినిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కెసిఆర్ హయాంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి అడుగులు వేసిందని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారని గుర్తు చేశారు.రాష్ట్రం రావడంతోనే ఈ ప్రాంతం జిల్లాగా ఏర్పడిందని దీంతో ప్రత్యేకంగా అభివృద్ధికి బాటలు పడుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్,మాజీ జెడ్పిటిసి కోవా అరుణ,పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్,మాజీ సర్పంచ్ మార్సుకోల సరస్వతి,నాయకులు  పోచయ్య, సలాం, సాజిద్, రవి, నిసార్, కాసిం, అన్సార్, హైమద్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.