14-01-2026 02:21:58 AM
మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
సికింద్రాబాద్ జనవరి 13 (విజయ క్రాంతి): మాంజా అంటేనే డేంజర్, చైనా మాంజా మరి డేంజర్ కాబట్టి పతంగులు ఎగరేసే పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే చైనా మంజను వాడొద్దని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సూచించారు. సంక్రాంతి పురస్కరించుకుని బోయిన్ పల్లి కంసారీ బజార్ వద్ద బీఆర్‌ఎస్ యువ నాయకులు టీంకు గౌడ్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి సంక్రాంతి సంబరాలు ప్రారంభించి, చిన్నారులకు పతంగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిజె టిల్లు పాటల తో పాటు కొత్తగా ఈ సారి కోడి పందేల కోళ్ల ను పట్టుకుని కోడిపందాలు నిర్వహించారు. ఎప్పటి లాగే తనదైన శైలి లో తీన్మార్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.భోగి ముగ్గులు వేసి,గంగిరెద్దుల ఆడించిన విన్యాసాలను తిలకించారు. గంగి రెద్దుల తో ఫోటోలు దిగారు.కొద్దిసేపు స్వయంగా ఆయన పతంగులను ఎగరేసి హల్చల్ చేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.