16-05-2025 12:24:16 AM
రేవల్లి : మే 15: నేటి వ్యవసాయంలో ర సాయన ఎరువులు లేకుండా వ్యవసాయం చేయడం మానవ మనవడుకు శ్రేయస్కర మని ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలలో వెల్ల డైందని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాల యం ప్రొఫెసర్ డాక్టర్ మహేశ్వరమ్మ, డాక్టర్ మాధురి అన్నారు,గురువారం ఏదుల మం డలంలోని చెన్నారం గ్రామంలో రైతు ముం గిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో వారు హాజ రై రైతులకు ఆధునిక శాస్త్రీయ సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిం చారు.
ఈ సందర్భంగా వారు మాట్లా డు తూ వ్యవసాయంలో రసాయన ఎరువులు , పిచికారి మందులు తగ్గించి సాగుభారాన్ని గణనీయంగ తగ్గించుకొని సుస్థిర వ్యవసా యం చేయవచ్చని వారు రైతులకు వివరిం చారు, ఈ కార్యక్రమంలో ఉద్యానవనశాఖ ఏడి భాస్కర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి కరుణ,ఏఈవో ఎండి. ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు,