16-05-2025 12:21:38 AM
మహబూబ్ నగర్ మే 15 (విజయక్రాం తి): ప్రపంచ సుందరిమలను పాలమూరులో ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన మ హా వృక్షం పిల్లలమర్రి ఆహ్వానిస్తుంది. దీంతో పాలమూరు జిల్లా పేరు ప్రఖ్యాతలు విశ్వ వ్యాప్తం కానున్నాయి. ప్రసక్తిగాంచిన కోహినూర్ డై మండ్ సహా గోల్కొండ వజ్రా లు సైతం పాలమూరు ప్రాంతాల నుంచి వచ్చాయంటే అతి శయోక్తి కాదు. అంతటి గొప్ప చరిత్రను కలిగిన ఈ ప్రాంతానికి మ రో అరుదైన గౌరవం దక్కనుంది.
ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన పిల్లలమర్రి భారతదేశంలోని అతి పెద్ద మహా వృక్షాలలో మూడవది. ఈ మహావృక్షం తన వేళ్ళలో మరొక అరుదైన రికార్డును ఇనుమడింప చేసుకోనున్నది. శుక్రవారం ప్రపంచ సుందరిమణులు (మిస్ వరల్ కంటేస్టెంట్లు) పాలమూరు జిల్లా కేంద్రం సమీపంలోని పిల్లల మర్రికి విచ్చేస్తుండడంతో ఈ సందర్భంగా పాలమూరు ప్రత్యేకత నో తెలియజే స్తూ విజయ క్రాంతి ప్రత్యేక కథనం అందిస్తుంది.
రుక్కమ్మపేట నుంచి పాలమూరు నుంచి మహబూబ్‌నగర్‌గా నామకరణం
మన మహబూబ్ నగర్ గతంలో రుక్కమ్మపేట పిలుచుకుంటూనే పాలమూరు గా పిలిచేవారు. నిజాం పాలన 1980లో మహబూబ్ నగర్ గా పేరు మార్చారు. ప్రసిద్ధ కో హినూర్ డైమండ్ తో పాటు ప్రముఖ గో ల్కొండ వజ్రాలు ఇక్కడి నుంచి వచ్చాయని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. గతంలో చోళవాడి చోళుల భూమి అని కూడా పిలువబ డింది. పాలమూరు నుంచి కృష్ణ తుంగభద్ర నదులు ప్రవహిస్తాయి.
అంతేకాదు సుమా రు 7 శతాబ్దాల చరిత్ర కలిగి తన వేర్లు మొద లు ఎక్కడో నీటికి గుర్తించలేని ఓ మహా వృక్షం ఈ ప్రాంత కీర్తిని మరింత పెంచుతున్నది. మహబూబ్ నగర్ పట్టణానికి సుమా రు మూడున్నర కిలోమీటర్ల దూరంలో నాలుగు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పిల్లలమర్రి మహావృక్షం రమనీయమైన ప్రకృతి క్షేత్రంలో పుర్రుపోసుకున్నది. ఇంతటి చారిత్రక ప్రసిద్ధి పొందిన మర్రిచెట్టును చెద పురుగులు తురచి వేయడంతో 2017 డిసెంబర్ లో ఒక కొమ్మ విరిగిపడింది. దీంతో చెట్టు వద్దకు సందర్శకులను అనుమతించడం ఆ పేశారు.
ప్రజలు చెట్టు వద్దకు వచ్చినా దాన్ని తాకకుండా ఉండేలా చుట్టూ ప్రహరీ నిర్మించారు. చెట్టును చూడాలనుకునే సందర్శకుల కోసం సమీపంలో ఒక ఫుడ్ ఓవర్ బ్రిడ్జి ని ర్మించారు. దానిపై నుంచే చూసేలా ఏర్పా ట్లు చేసి ఆ తరువాత చెద పురుగులు నుంచి రక్షణ కవచంలా వైద్య సేవలు అందించి క్లోరోఫైరీ ఫస్ దావణాన్ని తొర్రల్లోకి పంపించారు. మర్రిచెట్టు మండల వంగిపోకుండా పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా పిల్లలను సైతం ఏర్పాటు చేసిన దాఖలాలు ఉన్నాయి.
ఇందుకు దుకు స్లున్ బాటిల్లను వాడారు. చెట్ల కొమ్మలకు డ్రిల్లింగ్ చేసి ద్రావణం వెళ్లేలా ఏర్పాటు చేసి పిల్లల మర్రి కి మరో మారు పునర్జన్మ జీవం పోశారు. పిల్లలమర్రి మహావృక్షం ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మళ్లీ జీవం పోసుకున్నది. ఒదిగిన చోటే ఎది గి తిరిగి చిగురించి తన చారిత్రక ఆనవాళ్లకు సజీవ సాక్షంగా నిలుస్తున్నది.
భారతదేశంలోనే అతిపెద్ద మర్రి చెట్లల్లో ఇది ఒకటని తె లంగాణ అటవీ ప్రత్యేక గుర్తింపును తన సొం తం చేసుకుంది. మొదట ఈ చెట్టును పీర్ల మర్రిగా పిలిచేవారు క్రమంగా పిల్లలమర్రిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చెట్టు షాకో శాఖలుగా విస్తరించడంతో దీని మొదలు ఎక్కడ అనేది తెలుసుకోలేనంతగా ఈ మర్రి చెట్టు విస్తీర్ణం విస్తరించి పోయింది.
ప్రదర్శనశాలలో అరుదైన ఆనవాళ్లు
16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వరి ఆలయం కృష్ణానది తీరంలోని ఈర్లదిన్నె గ్రా మంలో ఉండేది. శ్రీశైలం డ్యాం నిర్మాణ సమయంలో ఏర్పడిన ముంపునకు గురైన నేపథ్యంలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని పరిరక్షించే ఉద్దేశంతో 1983 లో పిల్లల మర్రి పురావస్తు ప్రదర్శనశాల ప్రాంగణానికి తరలించి అధునాతన పునాదులపై 1983లో తిరిగి పునర్ ప్రతిష్టించారు.
విజయనగరం వాస్తు శైలిలో నిర్మించిన ఈ ఆలయం 16వ శతాబ్దానికి చెందినది. అప్ప టి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హ యాంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పురావస్తు ప్రదర్శన శాఖలో జిల్లాకు చెందిన పలు గ్రామాలు పట్టణాల్లో సేకరించిన శిల్పాలు శాసనాలు రాతియుగపు పనిముట్లు హైదరాబాద్ స్టేట్ మ్యూజియం నుంచి సేకరించిన పంచలోహ విగ్రహం పిల్లల మర్రి ప్రదర్శనశాలలో ఉంచారు.
పిల్లల మర్రి లోని శిల్ప విశిష్టత చూపరులకు కనువిందు చేస్తుంది సందర్శకులకు విజ్ఞానంతో పాటు వినోదాలతో పాటు ఆధ్యాత్మిక చింతనతో కూడిన ప్రశాంతతను కూడా కల్పిస్తుంది. పిల్లల మర్రిలో ప్రదర్శించిన శిల్పాలు మహబూబ్నగర్ జిల్లాలోని అల్వాల్ పల్లి గొల్లంతగుడి పూడూరు నంది వడ్డెమాన్ పానగల్ కల్వకో ల్ ప్రాంతాలకు చెందినటువంటి హిందూ బౌద్ధ జైన మతాలకు సంబంధించిన ప్రతిమలు.
అలాగే అమరాబాద్ త్రవ్వకాల్లో లభించిన పాత రాతియుగం పనిముట్లు నవ్విన శిలాయికపు పనిముట్లు బృహ శిలాయుగ పు కొండలు, పాత్రలు, విజయనగర కుతుబ్షాహీల కాలంనాటి ఆయుధాలు విగ్రహాలు ఎన్నో ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది.
పాలమూరు బ్రాండ్ అంబాసిడర్‌గా పిల్లలమర్రి
పిల్లలమర్రి అంటే యావత్తు ఉమ్మడి రాష్ట్రంలోనూ కూడా పాలమూరు జిల్లాలో ఉందనే పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. పిల్లలమర్రి శిల్ప విశిష్టత చూపనులను కనువిందు చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ ఆధ్వర్యంలో పిల్లల మర్రిలో జిల్లా మ్యూజియం ఏర్పాటు చేశారు. శాతవాహనుల నుంచి అసఫ్జాహీ రాజుల వరకు ము ద్రించిన నాణెములు ఇక్కడ ప్రదర్శించిన వాటిలో ప్రముఖమైనవి.
పిల్లలమర్రిలో ఇం కా ఎన్నో విహారయాత్రకు వచ్చే వారి కోసం ఇక్కడ మినీ జూ పార్కు ఉంది రకరకాల ప క్షులు నెమలిలో కుందేళ్లు కోతులు వివిధ రకాల కు చెందిన ఎక్వేరియం కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుంది ఇక్కడే జింకల పార్కు కూడా ఉన్నది.
చిన్నారులను మరింత విశేషంగా ఈ ప్రాంతం ఆకట్టుకుంటూ వ స్తుంది. గతంలో వివిధ ప్రాంతాల నుంచి పిల్లల మరిన్ని చూసేందుకే వేలాది మంది వచ్చి తిలకించి వెళ్లేవారు. నేటికి కూడా అది జరుగుతూనే వస్తుంది. ప్రపంచ సుందరిమణులు కూడా పిల్లలమర్రి సందర్శనకు రావ డంతో పిల్లలమర్ ప్రాముఖ్యత మరింత మా రుమోగుతుంది.
సంస్కృతి సాంప్రదాయాలకు పాలమూరు నిలయం..
పిల్లలమర్రికి సందర్శనకు విచ్చేయుచున్న సుందరీమణుల అధికారులు ప్రత్యేక మైన ఏర్పాట్లు చేశారు. పాలమూరు అంటే నే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. ఇంతటి ప్ర ఖ్యాతలు సాధించిన ఆలయాలు పర్యాటకం గా పేరుగాంచిన ప్రాంతాలను తనివి తీర పరిశీలించేందుకు ప్రపంచ సుందరిమణులు పాలమూరుకు తరలి రావడం ఇక్కడి గొప్పతనానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
హైదరా బాద్ నుంచి రోడ్డు మార్గంలో నేడు సా యంత్రం ఐదు గంటలకు పిల్లలమర్రి చేరుకుంటారు. అక్కడే సుమారు రెండు గంటల పాటు చారిత్రక ఆలయాలను జిల్లా మ్యూజియంతో పాటు పిల్లలమర్రి చరిత్రను వాటి ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. పాలమూ రు వారసత్వాన్ని సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభు త్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
ఇం దులో భాగంగా పర్యాటకశాఖ విస్తృతంగా ఏర్పాటు చేస్తోంది. ప్రపంచ సుందరిమణు లు పిల్లలమర్రి పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇక్కడ చరిత్రను పిల్లలమర్రి ప్రాము ఖ్యతను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యాచరణ చేపట్టిన విషయం అందరికీ విధితమే.
అదిరిపోయేలా పకడ్బందీ ఏర్పాట్లు
అందాల భామల పర్యటనకు సంబంధిం చి మహబూబ్నగర్ జిల్లా అధికార యం త్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. మ హబూబ్నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి ఎస్పీ జానకి తర్వాత ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో పాటు ఏర్పాట్లను చేస్తున్నది. ఇప్పటికే ఐజి సత్యనారాయణ జోగులాంబ జోన్ డిఐజి ఎల్ హెచ్ చౌహన్ సహా ఇక రా జిల్లా అధికారులు అదనపు కలెక్టర్లు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
వెయ్యి మందికి పైగా పోలీస్ అధికారులు సి బ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. వారికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరి పర్యటనను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీ సుకుంటున్నది. మిస్ వరల్ పోటీలో నేపథ్యంలో ప్రతి అంశం లోను తెలంగాణ క్యాతి ప్రతిబింబించేలా అధికారులు ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నారు. ‘తెలంగాణ జరూర్ ఆనా ‘ అనే థీమ్ తో ప్రభుత్వం అందాల భామలు, ప్రాచీన ఆలయాలు పర్యాటక ప్రాం తాల అందాలు తిలకించేలా ప్రణాళికలు ర చించింది.
తద్వారా పాలమూరు ఖ్యాతిని ప్ర పంచానికి పరిచయం చేయనున్నారు. వీటన్నింటిని తిలకించే అందాల భామలు మం త్రముక్తులు కావడం తథ్యం. ఓవైపు ప్రపంచ సుందరి మనలో పర్యటన విజయవంతం చే సేందుకు అధికారులు సకల ఏర్పాటు చే స్తుంటే మన వైపు ప్రజానీకం మాత్రం అం దాల భామలను చూసేందుకు వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే ప్రచారంలోకి రావడంతో మరింత ఆసక్తిని తీసుకురావడం జరుగుతుంది.