calender_icon.png 16 May, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్త సమ్మెలో ఉపాధి కూలీలు పాల్గొనాలి

16-05-2025 12:26:30 AM

చిన్న చింతకుంట, మే 15: ఈ నెల 20న చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెలో ఉపాధి కూ లీలు  పాల్గొనాలని  టి యు సి ఐ జిల్లా అ ధ్యక్షులు జేఎన్ దేవదానం కోరారు.గురువారం కురుమూర్తి గ్రామంలో ఉపాధి కూ లీలతో ఆయన మాట్లాడుతూ దేశంలో కా ర్మిక  చట్టాలన్నీ కూడా రద్దు చేసి నాలుగు కోడ్ లుగా తీసుకొచ్చిన నరేంద్ర మోడీకి వ్య తిరేకంగా కార్మికులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్మికులకు  ఉపాధి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అ నంతరం దేశవ్యాప్త సమ్మె కరపత్రాలను ఉ పాధి కూలీలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు కృష్ణయ్య, సాకలి బాలరాజ్, వెంకటన్న, హనుమంతు, మహి ళా కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.