18 August, 2026 | 10:55 AM

ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం

16-06-2024 12:05 AM
  • సీపీఎం రాజకీయ శిక్షణ తరగతుల్లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీరయ్య

యాదాద్రి భువనగిరి, జూన్ 15 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను సంఘటితం చేసి ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్ వీరయ్య పిలుపునిచ్చారు. భువనగిరిలో శనివారం నిర్వహించిన సీపీఎం రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలో బీజేపీకి ప్రజాదరణ తగ్గిందని, అందుకే లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు తగ్గాయని అన్నారు. 

రాజ్యాంగాన్ని మార్చాలనుకున్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక హామీలు గుప్పించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ వంద రోజులు గడుస్తున్నా వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, నాయకులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, మంగ నర్సింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.