calender_icon.png 8 June, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షికారు పోదమ

07-06-2025 12:00:00 AM

క్రేజీ యంగ్ హీరో సంతోష్ శోభన్, అం దాల భామ ఫల్గుణి ఖన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’. జీ సుభాష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తొలికాపీ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. దీంతో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు త్రిపుర క్రియేషన్స్ అధినేత, ఈ మూవీ వరల్డ్ నెగటివ్ హక్కుదారుడు మురళీకృష్ణ వంకాయలపాటి తెలిపారు.

సిని మా గురించి ఆయన ఇంకా చెప్తూ.. ‘ఇది మధురమైన రొమాంటిక్ కామెడీ కథ. లైట్ హార్టెడ్ ట్రావెల్ మ్యూజికల్ లవ్‌స్టోరీ. సినిమాటోగ్రఫీ, సంగీతం చిత్రానికి ఓ ఆకర్షణగా నిలుస్తాయి” అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: నాగవంశీ; సినిమాటోగ్రఫీ: సాయి సంతోష్.