10-12-2025 12:57:43 AM
కాంగ్రెస్ సర్పంచ్‌కి ఎమ్మెల్యే పూర్తి సహకారం ఉంటుంది
ఉంగరం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ సర్పంచ్‌ని గెలిపించండి: ఎమ్మెల్యే మేఘారెడ్డి
గోపాలపేట, డిసెంబర్ 8: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అన్నారు. మంగళవారం గోపాలపేట మండల కేంద్రంలో స్థానిక ఎన్నికల ప్రచారం చివరి గడువు ముగియండంతో ఎమ్మెల్యే మెజారిటీ ప్రచారంలో పాల్గొన్నారు. గోపాలపేట తో పాటు బుద్ధారం పోలికపాడు ఏదుట్ల ఏదుల తదితర గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాంగ్రెస్ సర్పంచును ఎన్నుకోవడం పట్ల గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. గోపాలపేట కాంగ్రెస్ సర్పంచ్ కి ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యే సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం నియోజకవర్గం ఎమ్మెల్యే కాంగ్రెస్ కావడం కాంగ్రెస్ సర్పంచులకు పెద్ద అండలా ఉంటుందని చెప్పారు.
గోపాలపేటకు గ్రామం ఈ మండలం వనపర్తి నియోజకవర్గంలోనే ఆదర్శ మండల కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. ప్రభుత్వం నుండి ఏ నిధులు వచ్చిన గ్రామానికి అభివృద్ధి కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతకుముందు ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి బస్టాండ్ లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వనపర్తి నాయకులు సర్పంచ్ సువర్ణ భర్త ఆంజనేయులు ఉమ్మడి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు సత్య శిలా రెడ్డి చంద్రశేఖర్ శివన్న జోగు సంజీవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.