6 April, 2026 | 4:45 AM

బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ముందుకువెళ్తాం

06-04-2026 02:54 AM

ప్రభుత్వ విప్, వేములవాడ, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 5 (విజయ క్రాంతి):భారత దేశ మాజీ ఉప ప్రధాని, దివంగత బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో ముందుకువెళ్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో రాజ న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద అంబేద్కర్ విగ్రహం ప్రాం గణంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వే డుకలు ఆదివారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు.

ముందుగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ప్రభుత్వ విప్ పూలమాలలు వేసి ని వాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, పంపిణీ చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పాటలు ఆలపించా రు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ. బాబు జగ్జీవన్ రామ్ భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారని, కార్మికులకు మద్దతుగా అనేక పోరాటాలు చేశారని, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి విశేష సేవలు అందించారని కొనియా డారు. ఆయన చూపిన బాటలో ముందుకు సాగుతామని వివరించారు.

బాబు జగ్జీవన్ రామ్ కూతురు మీరాకుమారి లోక్ సభ స్పీకర్ గా ఉన్నపుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేశారు. ఈ నెలలో మహనీయుల జయంతి వేడుకలు ఉన్నాయని, ఈ నెల 11వ తేదీన మహాత్మా జ్యోతి రావు పూలే, 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఉన్నాయని తెలిపారు. ఏడాది సమయంలోపే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయం ఎదు ట మహాత్మాజ్యోతి రావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మ హాత్మా జ్యోతి రావు పూలే విగ్రహాన్ని హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్క రించనున్నారని వెల్లడించారు. సిరిసిల్ల, వేములవాడ లో బాబు జగ్జీవన్ రామ్ వి గ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మహనీయులు సేవలు గుర్తు చే స్తూ వారు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామని ప్రభుత్వ విప్ తెలిపా రు.కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూ పారెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, పీడీ హౌసింగ్ వెంకట మాధవ రావు, మైనింగ్ ఏడీ క్రాంతి కుమార్, ఉద్యానవన అధికారి శరత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డీవైఎస్‌ఓ రాం దాస్, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిశోర్ కుమార్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, మై నార్టీ సంక్షేమ శాఖ అధికారి భారతి, ఏఎస్ డబ్ల్యూఓ విజయలక్ష్మి, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, మున్సిపల్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.