17-07-2025 12:50:46 AM
పీఆర్టీయూ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్
బెజ్జూర్, జూలై ౧౬ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పీఆర్టీయూ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమా ర్ అన్నారు. బుధవారం మండలంలోని పాపన్నపేట, బెజ్జూర్, ఏటిగుడా, గబ్బాయి గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు నియమించాలని కేజీబీవీ ఉపాధ్యాయులకు ఎం టి ఎస్ ప్రకటించి కేర్ టెకర్ లను నియమించాలన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు కల్పించిన సౌకర్యాలని కేజీబీవీ ఉపాద్యాలకు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులను వెంటనే నియమించాలని బదిలీల తో కూడిన పదోన్నతులు చేపట్టాలన్నారు. విద్యా రంగ సమస్యలకు పరిష్కారానికి పీఆ ర్టీయూ పోరాటం చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శు లు తిరుపతి, సుభాష్ ,మండల విద్యాధికారి సునీత, కేజీబీవీ ప్రిన్సిపాల్ అరుణ ,మహిళ జిల్లా అధ్యక్షురాలు సమత, కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు.