17-07-2025 12:50:09 AM
చండూరు,(విజయక్రాంతి): రేషన్ కార్డుల కోసం ప్రజా పాలన, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులపై వెంటనే విచారణ చేసి పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చండూరు ఆర్డీవో శ్రీదేవికి సూచించారు. బుధవారం ఆమె చండూరు ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.భూభారతి కింద వచ్చిన దరఖాస్తులు, వాటి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతేగాక దరఖాస్తులను పరిశీలించారు. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు భూభారతి దరఖాస్తులను కేటగిరి వారిగా విభజించుకొని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్ పరిధిలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పురోగతికి తగు సూచనలు చేశారు.ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ ఆర్డిఓ తో మాట్లాడి తెలుసుకున్నారు. వీరి వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, సిబ్బంది తదితరులు ఉన్నారు.