calender_icon.png 4 October, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం

04-10-2025 12:44:47 AM

మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి

వనపర్తి, అక్టోబర్ 03 ( విజయక్రాంతి ) : రేపు జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకులకు సూ చించారు. శుక్రవారం బి ఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాల యం లో ఉమ్మడి పెబ్బేరు మండలం బి.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రజలు నిత్య చైతన్యవంతులు అని వాళ్లకు అన్ని తెలుసు అని మన సేవాభా వం, మన ప్రవర్తన, ప్రజల కోసం పోరాడే స్పూర్తి పట్ల ప్ర జలు అవగాహన కలిగి ఉండి మనల్ని ఆదరిస్తారన్నారు.

ఎన్నికలో డబ్బులు ప్రధానం కాదని ప్రజా సమస్యల పట్ల పోరాడే మనస్తత్వం ఉండాలని ఆయన హితోపదేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఆశయంతో పాటు ప్రజలలో చైతన్యం తెచ్చి డబ్బు ప్రభావం తగ్గించాల్సిన బాధ్యత కూడా మనదేనన్నారు. మీ అభ్యర్థిని మీరే నిర్ణయించండని ప్రజల గుండెల్లో స్థానం సం పాదించుకొనే వ్యక్తులను గుర్తించాలన్నారు.

మీ అభిప్రాయాన్ని గౌరవించే బాధ్యత నేను తీసుకుంటాను అని నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమములో జిల్లా పార్టీ ఆద్యక్షులు గట్టు యాదవ్,మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు వనం.రాములు, వెంకటస్వామి,పట్టణ అధ్యక్షులు దిలీప్ రెడ్డి,వైస్ చైర్మన్ కరేస్వామి,మాజీ జెడ్. పి.టి.సి పెద్దింటి.వెంకటేష్,విశ్వరూపం,హరిశంకర్ నాయుడు,మాజీ ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.