04-10-2025 12:42:58 AM
మీ నమ్మకం రెట్టింపయ్యేలా పనిచేస్తా
- దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
చిన్న చింత కుంట, అక్టోబర్ 3: సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం అడుగు లు వేస్తుందని పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరి అంచనాలను మించి అభివృద్ధి చేసుకుందా మని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. దుప్పల్లి గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, గౌడ సంఘం అధ్యక్షులు ఎ. జనార్దన్ గౌడ్ , గౌడ సంఘం కార్యదర్శి బలరాం గౌడ్ , గౌడ సం ఘం ఉపాధ్యక్షులు పుల్లయ్య గౌడ్, కోశాధికారి లచ్చ గౌడ్ , గౌడ సంఘం నాయకులు తిరుపతి గౌడ్ , బాలా గౌడ్, మన్నెం గౌడ్, గణేష్ గౌడ్, నరేష్ గౌడ్, గౌడ సంఘం నాయకులు, గ్రామాని కి చెందిన పలువురు బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరి సంక్షేమం కోసం ప్ర తిక్షణం పాటుపడి పని చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఉన్నారు.