04-10-2025 12:45:46 AM
ములకలపల్లి, అక్టోబర్ 3, (విజయ క్రాంతి):ములకలపల్లి మండలంలోని జడ్పిటిసి, పది ఎంపీటీసీ, గ్రామపంచాయతీలు, వార్డులలో అన్నింటిలో బిజెపి పోటీ పోటీ చే స్తుందని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అనుముల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం పార్టీ మండల అధ్యక్షులు జి.శంకర్ అధ్యక్షతన ఏ ర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడా రు.పార్టీ నిర్మాణం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో కచ్చితంగా గుర్తింపు ఉంటుం దన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చా టడమే ఏకైక లక్ష్యంగా కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు , పూనెం నవీన్ కుమా ర్, అత్యం మణికంఠ సాయి, ఊకంటి మధుసూదన్ రావు, సొసైటీ డైరెక్టర్ చీకటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.