20-11-2025 12:43:59 AM
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడి పోయిన చోటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచి చూపిద్దామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. గతంలో నష్టపోయిన చోటే తిరిగి బలాన్ని పుంజుకోవాలని, ‘ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి’ అనే సామెతను గుర్తు చేస్తూ కార్యకర్త ల్లో ధైర్యాన్ని నింపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై తెలంగాణ భవన్‌లో బుధవారం కీలక సమావేశం నిర్వహించా రు.
సమావేశానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు,తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇతర ఎమ్మెల్యేలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ము ఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దివంగత గోపీనాథ్ మరణం తర్వాత పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలిచిందని గుర్తుచేశారు. గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్‌స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని ప్రశంసించారు.
ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అక్రమాల కు పాల్పడ్డాయని కేటీఆర్ ఆరోపించారు. వ్యక్తిగత విషాదంలో ఉన్నా హరీశ్‌రావు పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక లే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. డిసెంబర్‌లోపు సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉం దన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై బీఆర్‌ఎస్ నాయకులు అధైర్యపడొద్దని, పో రాటస్ఫూర్తితో పనిచేసిన కార్యకర్తలదే నైతిక విజయమని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.