calender_icon.png 10 January, 2026 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్దాం..

09-01-2026 12:00:00 AM

సర్పంచ్ విమల 

సిర్గాపూర్, జనవరి 8: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామ పంచాయతీ తొలి సమావేశం గురువారం నాడు సర్పంచ్ మల్లగారి విమల విట్టల్ రెడ్డి నూతన వార్డు సభ్యులుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ  అందరు కలిసి గ్రామ అభివృద్ధి కోసం పాటు పడదామని, ఒకే కుటుంబంగా కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని మెంబర్లను తెలిపారు. 12 వార్డులలో నీటి, మురికి కాలువలు, వీధి దీపాలు, ఇతర వాటిపై చర్చ జరిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గూడూరి రమేష్, 12 వార్డులకు సంబందించిన సభ్యులు పాల్గొన్నారు.