calender_icon.png 10 January, 2026 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటింటి తనిఖీలు వేగవంతం చేయాలి

09-01-2026 12:00:00 AM

సిద్దిపేట కలెక్టర్ హైమావతి

కొండపాక, జనవరి 8: సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయాన్ని గురువారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి సందర్శించారు. మండలంలోని ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించి, ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో సూపర్ వైజర్ లు, బిఎల్ ఓ లు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణకు సంబంధించిన అన్ని పనులను ఫీల్ స్థాయిలో ఇంటింటి తనిఖీలు వేగవంతం చేసి, రోజువారీగా చేసిన మ్యాపింగ్ వివరాలు కంప్యూటర్ లో అప్లోడ్ చేసే ప్రక్రియను పరిశీలించారు.