బీజేపీకి ఓటేసి కొండాను గెలిపిద్దాం
22-04-2024 12:41 AM
అందెల శ్రీరాములుయాదవ్
మహేశ్వరం, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి) : దేశం కోసం జరుగుతున్న ఎన్నికల్లో చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించి మోదీకి బహుమతిగా అందజేయాలని మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి అందెల శ్రీరాములుయాదవ్ అన్నారు. ఆదివారం మహేశ్వరం శ్రీరాజ రాజేశ్వరాల యంలో విశ్వేశ్వర్‌రెడ్డి విజయం సాధించాలని కోరుతూ శివాలయంలో శివుడికి ప్రత్యే కంగా అభిషేకం పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి కమలం పువ్వుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎంపీటీసీ పోతర్ల సుదర్శన్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు.






