18 May, 2026 | 6:39 PM

హనుమాన్ ఉత్సవాలు శాంతియుతంగా జరపాలి

22-04-2024 12:43 AM

n మెదక్ ఎస్పీ బాలస్వామి

మెదక్, ఏప్రిల్ 21(విజయక్రాంతి) : జిల్లా లో నిర్వహించే హనుమాన్ జయంతి ఉత్సవాలను ప్రజలంతా శాంతియుతంగా జరు పుకోవాలని, శోభాయాత్రలో పోలీసులకు సహకరించాలని మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సంబంధిత రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ విధులు నిర్వర్తించాలన్నారు. ఈ సందర్భంగా పోలీ సు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవసరం ఉన్న ప్రదేశాలలో ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయాలని, ప్రతి చౌరస్తా వద్ద పికెట్స్, ట్రాఫిక్ పాయింట్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలో ఇతరుల మనోభావాలు దెబ్బతి నేలా పోస్టులు పెట్టరాదన్నారు.