18 May, 2026 | 8:25 PM

కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

22-04-2024 12:40 AM

ఎల్బీనగర్, ఏప్రిల్ 21 : మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలు పు పక్కా అని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సీనియర్ నాయకుడు ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్నారామ్మోహన్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మె ల్సీ సమక్షంలో సుమారు 1500మంది బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరా రు. ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో రామ్మోహన్‌గౌడ్ నివాసంలో జరిగిన చేరికల కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలనకు ఆకర్షితులై వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. ఎస్సీ సెల్ నాయకుడు జోగు రాములు, నాయకులు కొటగిరి ఉషారాణి, మనీశ్‌గౌడ్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. కార్యక్రమంలో కార్పొరేటర్ రాజశేఖర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రార్థనలో సునీతామహేందర్‌రెడ్డి

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు చర్చిల్లో ఆదివారం జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్, టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తామని, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు.