ఇంజనీర్స్ ని సన్మానించిన ఎల్ హెచ్ పిఎస్ నాయకులు
15-09-2026 | 11:02pm
కోదాడ,(విజయక్రాంతి): ఎల్ హెచ్ పి ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి భూక్యా కోట్యానాయక్, స్థానిక 8వ వార్డు కౌన్సిలర్ రామిశెట్టి హరిప్రసాద్ ఆధ్వర్యంలో కోదాడ ఇరిగేషన్ డివిజనల్ కార్యాలయంలో(Kodada Irrigation Divisional Office) డిఈ బర్మావత్ పంతుల్య నాయక్ని మంగళవారం ఇంజినీర్స్ డే(Engineers Day) సందర్భంగా సన్మానిచారు. వారితో పాటు ఏ.ఈ.ఈ. నాగప్రియంక, ఏఈ భరత్ అఖిల్ లకు కూడా ఇంజినీర్స్ డే శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు భూక్యా రవినాయక్, భూక్యా చంద్ర శేఖర్,రమేష్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు